search results

Saturday, 2 July 2011

వింతలోకం

 వింతలోకం
గౌతమిపురం అనే రాజ్యాన్ని నరేంద్రవర్మ అనే రాజు పరిపాలించుచున్నాడు.వయస్సు లో పెద్దవాడు అవటము వలన రాజ్య భారాన్ని తన కుమారుడు మోహనవర్మ కు అప్పగించ దలచి తన నిర్ణయాన్ని   ప్రధాన మంత్రి మాధవశర్మ తో చర్చించినాడు.
మాధవశర్మ రాజు నిర్ణయము సరి ఐనదేనని యువరాజుని కూడా తన అభిప్రాయము తెలుపవలసినదిగా కోరదామన్నాడు.
పట్టాభిషేకానికి  యువరాజు మోహనవర్మ సరే అన్నాడు.
నరేంద్రవర్మ మనస్సు కుదుటపడి చాల సంతోషము గ ఉండ సాగినాడు.
ఒక రోజు నరేంద్రవర్మ తన ప్రధానమంత్రి ఇతర మంత్రులు సేనాధిపతి ముఖ్యులతో సమావేశము ఏర్పాటు చేసి మోహనవర్మ పట్టాభిషేకానికి సంబందించిన ఏర్పాట్లు గురించి  చర్చించినాడు.
అందరు నాలుగు రోజులకి రానున్న వైశాఖ శుద్ధ  పౌర్ణమి రోజు పట్టాభిషేక మహోత్సవానికి నిర్ణఇంచుకున్నారు.
పట్టాభిషేకానికి ఘనంగా ఏర్పాట్లు జరగుతున్నాయి.
అన్ని దేశముల రాజులకి ఆహ్వానాలు పంపించారు.
తెల్లవారితే యువరాజు పట్టాభిషేకం.గౌతమిపురము సందడి గ వుంది .
యువరాజు మోహన వర్మ తన మందిరము లో హాయి గా నిద్రపోతున్నాడు.యువరాజు మందిరముచుట్టు కట్టుదిట్టమయిన భద్రత వుంది.
అప్పుడు జరిగింది ఒక ఊహించని సంఘటన!
ఆకాశము నుండి వింత ఐన బ్దాలు రా సాగాయి. గాలి వేగము గా  వీయ సాగింది. 
రాజమందిరము లోని వారు ఉలిక్కిపడి లేచారు.భటులు అప్రమత్తులయ్యారు. అందరు ఆసక్తిగా భయముగా  ఆకాశము వైపు చూస్తున్నారు.
యువరాజు, రాజు తో సహా ఇతర ముఖ్య మైనవాళ్ళు పరిస్థితిని గమనించ సాగరు. 
వందల పక్షులు ఆకాశములో గుంపులుగా భయముతో ఎగిరి పోసాగాయి. 
ఆకామునుండి భయంకరమయిన శబ్దము రాసాగింది. పున్నమి వెన్నెల కన్నా కొన్ని వందల రెట్లు కాంతి వెలువడింది.
ఆకాశము నుండి క్రమంగా పెద్దపరిమాములో స్తంభము లాంటిది రాజమందిరము లోని ఉద్యానవనము వైపు సాగుతూ రాసాగింది.
వింతలోకము నుండి భూలోకమునకు 
అలా సాగుతూ వస్తున్న స్థంభం కొన్ని అడుగుల ఎత్తు నుండి వొంపు తిరిగి ఏటవాలుగా సాగుతూ ఉద్యానవనము లోని భూమిని తాకుతూ  ఆగిపోయినది కోటలోని పరివరివారము మొత్తము ఉద్యానవనము వైపు గుంపులుగా వచ్చి ఆశ్చర్యం గా తిలకించ సాగారు.దానిని పరిశీలింఛి అది స్వచ్ఛమయిన బంగారముతో ఉన్నట్లుగా గ్రహించారు.అందరూ తలలు పైకి ఎత్తి ఆ స్తంభాన్ని చూడసాగారు.కనుచూపుమేరలో దాని మొదలు కనిపించలేదు.
  ఆకాశములోకి చొచ్చుకోనిపోయి ఆకాశమునుండి భూమికి వేసిన రహదారిలా వున్నది.స్థంభం మూడు అంచులు కలిగి మూడు అంచుల రహదారిలా వున్నది. 
    యువరాజు ధైర్యంగ దానిమీద చేయి వేసి పరిశీలించాడు. స్థంభం నుండి ప్రకంపనలు వస్తున్నట్లు గుర్తించాడు.
అంతకంతకు ప్రకంపనలు ఎక్కువకాసాగాయి.యువరాజు ప్రమాదాన్ని శంకించాడు.తండ్రితో సైన్యాన్ని సిద్ధం చేయమని కోరాడు. 
రాజు ఆజ్ఞతో ఉద్యానవనము నుండి కోట పరిసరప్రాంతములు మొత్తము సైన్యము తో నిండి పోయినది.
స్థంభం ప్రకంపనలతో హోరెక్కుతుంది.
పైనుండి స్థంభం మూడు అంచుల మీదుగా త్రిభుజాకారం ఆకారాలు జారుతూ వస్తున్నాయి.దగ్గరికి వచ్చే కొలది వాటి పరిమాణము పెద్దవిగా   కనపడ సాగాయి. 
అవి వేరే గ్రహమునుండి వస్తున్న వాహనాలని గ్రహించడం యువరాజుకు పెద్ద కష్టం కాలేదు......................
త్రిభుజాకారము వాహనములు భూమికి  దగ్గరకు  వస్తుంటే అందరు ఊపిరి బిగపట్టారు.
కొన్ని వాహనముల లోపలినుండి అందమయిన నెమళ్ళు బయటకు రా సాగినాయి.
అలా నెమళ్లు బయటకు వచ్చి వృత్తాకారం గా ఏర్పడి గాలిలో ఎగరసాగాయి చివరగా ఒక నెమలి త్రిభుజాకారము వాహనములో నండి బయటకు వచ్చి వలయాకారము మధ్యలో రెక్కలతో విన్యాసాలు చేయసాగింది.అది మిగతా నెమళ్ళ కన్నా భిన్నంగా మరింత అందంగా వుంది.






    
 

   
     


    
 

   
     

No comments: